Magazines

మురసు తుఫాన్ ధాటికి రహదారులకు గండ్లు

14 గంటల క్రితం

Roads flooded
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

- పలు ప్రాంతాల్లో తెగిపోయిన రోడ్లు

- సగం రహదారి పైనే కొనసాగుతున్న రాకపోకలు

- వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

- ఆర్ అండ్ బి డీఈ ప్రకాశ్ 

నవతెలంగాణ - అశ్వారావుపేట

మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లు మరియు భవనాల శాఖ అశ్వారావుపేట డివిజన్ లోని పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల రహదారులకు గండ్లు పడగా, మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల ప్రమాదకర పరిస్థితుల మధ్య సగం రహదారి పైనే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.


రోడ్లు, భవనాల శాఖ డివిజనల్ ఇంజనీర్ ఎం.ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం - దమ్మపేట రహదారిలో కిలోమీటర్ 2/4-6 వద్ద గండి పడింది. అలాగే ఊట్లపల్లి - నారాయణపురం రహదారిలో కిలోమీటర్ 19/4 వద్ద, మద్దికొండ - జమ్మిగూడెం రహదారిలో కిలోమీటర్ 2/4 వద్ద రహదారులు దెబ్బతిన్నాయి. అశ్వారావుపేట - బూర్గంపాడు రహదారిలో కిలోమీటర్ 4/4 వద్ద గండి పడటంతో ప్రస్తుతం సగం రహదారి పైనే ట్రాఫిక్‌ ను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా దమ్మపేట మండలం గండుగులపల్లి - అశ్వారావుపేట రహదారిలో కిలోమీటర్ 22/2 వద్ద గండి పడగా, ఇక్కడ కూడా సగం రహదారి పైనే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.


మరోవైపు బాల రాజుగూడెం - ఊట్లపల్లి రహదారిలో కిలోమీటర్ 12/4 వద్ద రహదారి తెగిపోయింది. భారీ వర్షాలు, వరద ప్రవాహం కారణంగా రహదారుల కింద మట్టి కొట్టుకుపోవడం తో ఈ పరిస్థితి ఏర్పడినట్లు ఆయన తెలిపారు. దెబ్బతిన్న రహదారుల వద్ద ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రహదారుల పునరుద్ధరణకు సంబంధించి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్