Magazines

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 

18 అక్టోబర్, 2026

Bathukamma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 

ఆలేరు పట్టణంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు పట్టణంలోని సంతోష్ నగర్, కొలనుపాక రోడ్డు, కనకదుర్గాదేవి ఆలయం, బొడ్రాయి, రంగనాయక ఆలయం శ్రీ చాముండేశ్వరి ఆలయం, కురుమ సంఘం, రామ్ శివాజీ నగర్, భరత్ నగర్, బీసీ కాలనీ, సిల్క్ నగర్, మైత్రి కాలనీ, క్రాంతి నగర్, బృందావన్ కాలనీ , చింతల్ బస్తి, కాటమయ్య నగర్, ఆదర్శనగర్ తో పాటు వివిధ కాలనీలలో సద్దుల బతుకమ్మ వేడుకలు మహిళలు  వివిధ రకాలతో కూడిన పూలతో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.


 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ కౌన్సిలర్లు పట్టణ ప్రముఖులు మహిళలు ప్రజాసంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్