Magazines

సాహసోపేత రక్షణ చర్యలకు 'సలాం'

13 గంటల క్రితం

rescue efforts
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

- కలెక్టర్ దివాకర టీఎస్‌ను ఆలింగనం చేసుకుని అభినందించిన మంత్రి తుమ్మల

నవతెలంగాణ-సత్తుపల్లి 

​బేతుపల్లి పెద్ద చెరువులో ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న 16 మందిని అత్యంత సమర్థవంతంగా, సురక్షితంగా బయటకు తీసుకురావడంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ విశేష కృషి చేశారు. కలెక్టర్ అందించిన ప్రాణ రక్షణ సేవలకు గాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనను మనస్ఫూర్తిగా అభినందించారు.


ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి గురైన మంత్రి తుమ్మల, కలెక్టర్ దివాకరను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకుంటూ "శభాష్ కలెక్టర్ గారూ!" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆపద సమయంలో అధికారులను వెన్నుతట్టి ప్రోత్సహించిన మంత్రి తుమ్మల ఔదార్యాన్ని, ఆప్యాయతానురాగాలను చూసి స్థానికులతో పాటు పలువురు నాయకులు ఆయనను కొనియాడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్