- సామూహిక వ్రతాలు, విశేష పూజలు
- వ్రతాల విశిష్టతను వివరించిన అధ్యక్షులు గుడిమెట్ల గాంధీ
నవతెలంగాణ-సత్తుపల్లి
స్థానిక కిరాణ మర్చంట్ కళ్యాణ మండపం పాతికేళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మండపంలో నిర్వహించిన ప్రత్యేక వ్రతాలకు విశేష స్పందన లభించింది.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆర్యవైశ్య దంపతులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కిరాణ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిమెట్ల గాంధీ పాల్గొని వ్రతాల విశిష్టతను వివరించారు. భక్తిభావంతో కూడిన పూజలు మనిషిలో సానుకూల దృక్పథాన్ని, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఇరవై ఐదేళ్లుగా సమాజ సేవతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మండపం వేదికగా నిలవడం ఆనందంగా ఉందన్నారు.
పూజలకు పాల్గొనేందుకు వచ్చిన ఆర్యవైశ్య దంపతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కమిటీ సభ్యుల సేవాభావాన్ని ఆర్యవైశ్యులు ప్రశంసించారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ కోశాధికారి వనమా శ్రీనివాసుదేవరావు (వాసు) ప్రధాన కార్యదర్శి, నడిపల్లి లక్ష్మీనారాయణ, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ఆర్యవైశ్య కుటుంబాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రజతోత్సవ వేడుకను విజయవంతం చేశారు.







కామెంట్లు (0)