Magazines

నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌లో ‘శ్రీవాణి’ సత్తా

3 రోజుల క్రితం

Srivani
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

- 33 మంది విద్యార్థినులు మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపిక

నవతెలంగాణ-సత్తుపల్లి 

జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌ ఎంపికలో 'శ్రీవాణి' బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు తమ సత్తా  చాటారు. ​​కేంద్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించే 'నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్'కు శ్రీవాణి  కళాశాలకు చెందిన 33 మంది విద్యార్థినులు అర్హత సాధించారు. 2026 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి, టాప్-20 పర్సంటైల్‌లో నిలిచిన విద్యార్థులకు కేంద్రం ఈ ఉపకార వేతనాన్ని అందిస్తోంది.


ఒకే కళాశాల నుంచి ఏకంగా 33 మంది విద్యార్థినులు జాతీయ స్థాయి స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడం విశేషం. ఏటా ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఈ ఘనత సాధించడం కళాశాల విద్యా ప్రమాణాలకు నిదర్శనమని ప్రిన్సిపాల్ పాలా ప్రవీణ్ రెడ్డి తెలిపారు. విద్యార్థినుల నిరంతర కృషి, అధ్యాపకుల అంకితభావంతోనే ఈ అద్భుత విజయం సాధ్యమైందని ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని కళాశాల యాజమాన్యం  తరపున ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్