డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పవన్
నవతెలంగాణ-మిడ్జిల్
రేవంతన్న పంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మిడ్జిల్ కస్తూర్బా పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు మహబూబ్‌నగర్ డాక్టర్స్ సెల్ జిల్లా కార్యదర్శి పవన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినులకు ఉచిత వైద్య పరీక్షలు అందిస్తున్నామని పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్య శిబిరానికి కల్వకుర్తికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్యతో పాటు తానూ హాజరవుతానని చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతి నిధులు , అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.







కామెంట్‌లు (0)