Magazines

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూక్య

3 గంటల క్రితం

MLA Bhukya
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు 

​పేదలను అన్ని రంగాలుగా అభివృద్ధి పరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబం బెజ్జం యాకలక్ష్మి వెంకటాద్రికి చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పేదలను అభివృద్ధి పరిచేందుకు ముందడుగు వేసిందని అన్నారు. 


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ బీమా పథకం,  ఇలా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తుందని అన్నారు.  గత పాలకులు చేసిన అభివృద్ధి ఏమి లేదని చెప్పారు. అనంతరం ఆ కుటుంబానికి ఇందిరమ్మ బీమా పత్రాన్ని ఎంపీడీఓ సింగారం కుమార్, తహసీల్ధార్‌ చందా నరేష్ అందజేశారు.

 అనంతరం ఎమ్మెల్యే మురళి నాయక్ను సత్కరించారు. 


MLA Bhukyaఅలాగే బెజం యాక లక్ష్మి వెంకటాద్రికి ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్లైన్ చేసి వారికి భీమా పత్రం అందించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, ఎంపీడీవో సింగారం కుమార్, తహసిల్దార్ చందా నరేష్ తెలిపారు. జీపీఓ సందీప్ జ్యోతి, పార్టీ మండల అధ్యక్షుడు ఎదెల యాదవ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు న్యాయని సత్యపాల్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, ఉపసర్పంచ్ పిట్టల ఉప్పలయ్య, తాళ్ల మునేష్, తాళ్ల సరిత, జిల్లా ఎల్లమ్మ, బెజం పెరుమయ్య, జిల్లా, మండల నాయకులు మద్ది రాజేష్ , ఆకుతోట సతీష్,  తదితరులు పాల్గొన్నారు. ​


కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటా : యాకలక్ష్మి

​మండలంలోని బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామంలోని నిరుపేదలైన బెజ్జం యాకలక్ష్మికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ మండల గ్రామ నాయకులకు కృతజ్ఞతలని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు యాకలక్ష్మి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి రుణపడి ఉంటామని తెలిపారు.  తాము నిరుపేద కుటుంబంలోని మాకు ఎన్నో ఏళ్ల నుండి సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఆశ ఉండేదని అన్నారు.  నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ధన్యవాదాలు తెలిపారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్