Magazines

విద్యార్థినుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు  

3 రోజుల క్రితం

health
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య సౌజన్య

నవతెలంగాణ-మిడ్జిల్

విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రంగాలలో రాణిస్తారని, విద్యార్థినుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు అని ప్రముఖ గైనకాలజిస్టు

డాక్టర్ రమ్య సౌజన్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో రుతుక్రమ, వ్యక్తిగత పారిశుధ్యంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రమ్య సౌజన్య మాట్లాడుతూ.. కౌమార దశలో ఉన్న బాలికలు ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రుతుక్రమణ 

 సమయంలో పాటించాల్సిన కనీస జాగ్రత్తలు, శానిటరీ న్యాప్‌కిన్ల సురక్షిత వినియోగం, వ్యర్థాల నిర్వహణ గురించి విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో వివరించారు.


అనంతరం రేవంతన్న పంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సేల్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి డాక్టర్ పవన్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు పంటి పరీక్షలు నిర్వహించారు. పండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోజుకు రెండుసార్లు బ్రష్ తో శుభ్రంగా పండ్లను తోముకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహ్మద్ గౌస్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు మిడ్జిల్ సర్పంచ్ ఎడ్ల శంకర్ ముదిరాజ్, వాడియాల మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, నరేందర్ రెడ్డి, రమేష్, వైద్య సిబ్బంది ప్రశాంత్ గౌడ్, పాఠశాల సిబ్బంది, తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్