Magazines

ఇంటి పర్మిషన్‌ కోసం వేలల్లో అక్రమ వసూళ్ళు

1 రోజు క్రితం

house permits
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

అమాయక భూ నిర్వాసితులను ఆసరా చేసుకొని ఇంటి పర్మిషన్ కోసం కొందరు పంచాయతీ సిబ్బంది రూ.300 రసీదుకు లకు రూ.20 వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడడంతో తాడిచెర్ల డేంజర్ జోన్లోని నిర్వాసితులకు అన్యాయం జరిగిందని యువకుడు ఇందారపు మహేందర్ ఆరోపించారు.


సోమవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ భూసేకరణ గ్రామసభలో మాట్లాడుతూ ఎస్సి,ఎస్టీ,బిసి నిరుపేద కుటుంబాలు జీవించడానికి డేంజర్ జోన్లో ఇండ్లు నిర్మించుకునే క్రమంలో పంచాయతీ పర్మిషన్ రసీదుల కోసం జీపీ కార్యాలయం చుట్టూ తిప్పుకొని చివరకు రూ.300 రసీదును చేతిలో పెట్టు రూ.10 నుంచి రూ.20 వేల వరకు వసూళ్లు చేసి జీపీ రికార్డులల్లో నమోదు చేయకుండా మోసం చేశారని వాపోయారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అట్టి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, నిర్వాసితులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్