నవతెలంగాణ - తొగుట
గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా భరోసా కలిగిస్తుందని సర్పంచ్ చిక్కుడు (మాస్టి) కళావతి స్వామి అన్నారు. మంగళ వారం మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా సందర్బంలో కుటుంబ పెద్ద మృతి చెందితే ఆ కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ బీమా ఆర్థిక చేయూత అవుతుందన్నారు.
గ్రామంలో ప్రతి ఒక్క రు ఈ బీమాను తప్పనిసరి నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని కవిత బాలరాజ్, గ్రామ పంచాయతీ కార్య దర్శి నరసింగరావు, జూనియర్ స్వామి, వార్డు సభ్యులు గొడుగు శ్రీశైలం, లింగాల మహేష్, ఇంది రమ్మ కమిటీ సభ్యులు, అంగన్వాడి టీచర్ గజ్జల రేఖ, ఆశా కార్యకర్త చిక్కుడు స్వరూప, తదితరు లు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)