Magazines

ఇందిరమ్మ జీవిత బీమాపై గ్రామ సభలు

4 రోజుల క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకంపై గ్రామ సభలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా మండల పరిధిలోని 21 గ్రామ పంచాయతీలలో ఈనెల 20 నుండి డిసెంబర్ 1 వరకు జరగనున్నాయని ఎంపీడీఓ సాయిలు, ఎంపీఓ సత్యనారాయణ రెడ్డిలు వెల్లడించారు.


ఈనెల 20న అంతాపూర్, 23న ఆవల్గావ్, చిన్న ఎక్లారా, చిన్న తడగూర్, మద్నూర్, రాచూర్, సోమూర్, తడి హిప్పరుగా,

25న చిన్న షక్కర్గా, లచ్చన్, పెద్ద తడగూర్, హెచ్ కేలూర్, సుల్తాన్ పేట్, 30న దన్నూర్, గోజేగావ్, కోడిచర, మేనూర్, పెద్ద ఎక్లార, శాఖాపూర్, డిసెంబర్ 1న పెద్ద షాక్కరగా, ఈ విధంగా గ్రామ సభలు నిర్వహించే వాటికి సూపర్వైజర్లుగా అధికారులను నియమించినట్లు వారు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్