జైభీం మహాసేన ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ - మల్హర్ రావు
భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి ఆపై చదువుల్లో విద్యార్థులు చదువుకోవడానికి పాఠ్యపుస్తకాల్లో పాఠ్యంశముల్లో ఒక ప్రత్యేక సబ్జెక్టుగా చేర్చించాలని జైభీం మహాసేన రాష్ట్ర నాయకులు అలెగ్జాండర్ ప్రభు, ఇందారపు ఎల్లయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
నాగపూర్ దీక్షభూమి చారిత్రాత్మక మార్పిడి మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో మండల కమిటీ ఆధ్వర్యంలో జైభీం మహాసేన జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యులు, జైభీం మహాసేన మండల అధ్యక్షుడు మెరుగు రాజయ్య, ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)