కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు విజయ్ కుమార్
నవతెలంగాణ-మిడ్జిల్
ప్రజా ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు నిరుపేదలకు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గడ్డల విజయ్ కుమార్ ,మండల కార్యదర్శి బొర్రా శివకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని వాడియాల గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ..పార్టీలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి అండగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని చెప్పారు. ప్రజలందరి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి మాటను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. పేదలకు అండగా నిలబడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.
గతంలో రాజకీయ మద్దతు ఉంటేనే సంక్షేమ పథకాలు అందేవని, జైజైలు కొడితేనే లబ్ధి చేకూరేదని, ప్రస్తుతం ఆ విధానాలకు పూర్తిగా స్వస్తి పలికామని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనను గాడిలో పెడుతూ ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు.







కామెంట్లు (0)