నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
అఖిలభారత యువజన కాంగ్రెస్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు శివారు మహేశ్వరం లోని కార్పోల్ చంద్రారెడ్డి రిసార్ట్ లో నిర్వహిస్తున్న తెలంగాణ యువజన కాంగ్రెస్ “యువ క్రాంతి- బనియాది” శిక్షణ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మంగ ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జక్కిడి శివ చరణ్ రెడ్డి తో కలిసి యువజన కాంగ్రెస్ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు బద్దం వాసుదేవ రెడ్డి ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులు మంగ కిరణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు ఎలిమినేటి సురేష్, పుట్టా గిరీష్ గౌడ్ లు పాల్గొన్నారు.