వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ మూవీని ఈనెల 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’నేను నవీన్ చిత్రానికి అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆయన ఇష్టంతో సినిమాలు చేయలేదు. సినిమాల పట్ల ఆయనె ప్పుడూ తృప్తిగా ఉండరు. ఓ సందర్భంలో ఆయన పర పతి చూసి షాక్ అయ్యాను. ఇకపై ఆయన తన మనసుకు నచ్చిన చిత్రాలే చేయాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ మూవీలో కోర్ట్ డ్రామాతో పాటు సస్పెన్స్ బాగుం టుంది. ఏ ఫ్రైడే అయినా కూడా సింగిల్‌గా సినిమా రాలేదు. ఒకరితో పోటీ అని కాదు.. మూవీ బాగుంటేనే ఆడియెన్స్ చూస్తారు. ఈ చిత్రాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలానే చూసుకున్నాం. ఇందులోని కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మాకు జీ టీం కూడా సపోర్ట్ చేస్తోంది. 19న మా చిత్రం రాబోతోంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని వడ్డే నవీన్ చెప్పారు. డైరెక్టర్ కమల్ తేజ నార్ల మాట్లాడుతూ,’టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అందరినీ ఆకట్టు కుంటుంది. ట్రైలర్ మాదిరిగానే సినిమా అద్భుతంగా ఉండబోతోంది` అని తెలిపారు.
ఆద్యంతం వైవిధ్యభరితం
- Advertisement -
- Advertisement -



