సాయంత్రం ఆరు దాటాక ఆమె ఫోన్ చేసింది.
”ఈరోజు ఫ్రీనా?”
”ఎందుకు?”
”ఒక చోటికి వెళ్లాలి.”
”ఎక్కడికి?”
”రెండు వందల కిలోమీటర్లు. వస్తావా?”
”ఇంత రబరజూవఅరవ ఎందుకు?”
”నువ్వు ‘వద్దు’ అనకుండా ఉండటానికి.”
నేను నవ్వాను. సమాధానంగా ఆమె కూడా నవ్వింది.
ఏడుగంటలకు కారు బయలుదేరింది. డ్రైవర్ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. మేమిద్దరం వెనక. హైదరాబాద్ ట్రాఫిక్ నెమ్మదిగా వెనక్కి జారిపోతోంది. ఆమె మొదట ఫోన్ కాల్స్‌లో బిజీగా ఉంది.
”అవును పిన్నీ… బయలుదేరాం…”
”లేదు, లేటవుతుంది…”
”చేరాక కాల్ చేస్తా…”
కొద్దిసేపటికి ఫోన్ సైలెంట్‌లో పెట్టింది. బయట వర్షం. చినుకులు కారు విండో గాజు మీద నెమ్మదిగా జారుతున్నాయి. ఎఫ్.ఎం.లో మెల్లగా ఒక పాత ఇళయరాజా పాట మొదలైంది. హైవే మీద లైట్లు నీళ్లలో పొడవుగా విరిగిపడుతున్నాయి.
ఆమె చెప్పులు తీసేసి సీట్లో కాళ్లు ముడుచుకుని కూర్చుంది.
”అలసిపోయావా?” అడిగాను.
”చచ్చేలా.”
”రోజంతా ఏం చేశావ్?”
”ఇంట్లో వాళ్లతో షాపింగ్… ప్యాకింగ్… తర్వాత ఈ ప్రయాణం.”
కొద్దిసేపు మౌనం తర్వాత..
”ఒక పని చేస్తావా?”
”చెప్పు.”
ఆమె ఎలాంటి మొహమాటం లేకుండా తన రెండు కాళ్లూ నా వళ్లో పెట్టింది.
”కొంచెం నొక్కు.”
నేను నవ్వేశాను.
”ఇది ఆర్డరా? రిక్వెస్టా?”
”ఇప్పుడది ముఖ్యం కాదు.”
నేను మెల్లగా ఆమె పాదాలు నొక్కుతున్నాను. ఆమె కళ్లుమూసుకుంది.
”ఇంత ్‌ఱతీవసగా ఎందుకు ఉంటావ్?” అన్నాను.
”మనుషుల్ని ఎక్కువగా షaతీతీy చేస్తే అలసట వస్తుంది.”
”అందులో నేనూ ఉన్నానా?”
”ఉన్నావ్… కానీ అలసట తెచ్చే వాళ్లలో కాదు.”
”మరి?”
”నీ దగ్గరికి వస్తే… జీవితాన్ని కొద్దిసేపు భుజాల మీద నుంచి దించేసినట్టు అనిపిస్తుంది.”
ఆ మాట తర్వాత కాళ్లు నొక్కుతున్న నా వేళ్లని ఆమె మెల్లగా పట్టుకుంది.
”ఇలా ఎప్పుడూ షaతీవ తీసుకోవచ్చుగా,” అంది.
”నువ్వే అవకాశం ఇవ్వవు.”
ఆమె చిన్నగా నవ్వింది.
ఆ నవ్వు అలసట మధ్యలో వచ్చిన చిన్న వెలుగులా ఉంది. కారులో మళ్లీ నిశ్శబ్దం పరచుకుంది. రాత్రి పదకొండు దాటేసరికి ఆమె కళ్లు తెరిచి…
”అన్నా… ఎక్కడైనా టీ దొరికితే ఆపండి.”
”సరే మేడమ్.”
ఇంకో పది నిమిషాల తర్వాత హైవే పక్కన హోటల్ దగ్గర కారు ఆగింది.
టిన్ షీట్ మీద వర్షం చప్పుళ్లు. లోపల ఆవిరి. కౌంటర్ దగ్గర నుంచి ఒక చిన్న పిల్లాడు టేబుళ్ల మధ్య పరుగులు తీస్తున్నాడు. మేము కూర్చోగానే అతను వచ్చాడు.
”అన్నా… టీనా?”
”రెండు టీలు.”
”సరే.”
వెళ్లబోతున్న అతన్ని ఆమె ఆపింది.
”ఒక్క నిమిషం… నీ పేరు ఏంటి?”
”మహేష్.”
”ఇంత రాత్రి ఇక్కడున్నావెందుకు?”
”రోజూ ఉంటా అక్కా.”
”స్కూల్?”
ఒక్క క్షణంలో అతని ముఖం మారిపోయింది.
”మానేశా”
చాలా సాధారణంగా చెప్పాడు. కానీ గుచ్చుకుంది. అతను ఏమీ పట్టించుకోనట్టే టీలు తెచ్చి టేబుల్ మీద పెట్టి మళ్లీ పరుగెత్తాడు. నేను టీ తాగుతున్నాను. ఆమె చూపు ఇంకా అతని వెంటే ఉంది.
”ఏం ఆలోచిస్తున్నావ్?” అన్నాను.
”మన దేశంలో పిల్లలు చాలా త్వరగా పెద్దవాళ్లు అయిపోతారు రామ్.”
నేను చారు గ్లాస్ తిప్పుతూ అన్నాను…
”పెద్దవాళ్లు మాత్రం చాలా ఆలస్యంగా మనుషులవుతారు.”
ఆమె నా వైపు చూసింది. తర్వాత మెల్లగా టీ గ్లాస్ పెదవుల దగ్గరకు తీసుకుంది.
కొద్దిసేపటి తర్వాత మేము బయలుదేరాం. కారు మళ్లీ హైవే మీదకి వచ్చింది. వర్షం తగ్గిపోయింది. ఆమె మెల్లగా తల నా వళ్లో పెట్టుకుని పడుకుంది. కారు లోపల మసక వెలుతురు. బయట అప్పుడప్పుడు దూసుకెళ్తున్న లారీలు. నేను ఆమె జుట్టులోకి వేళ్లు పోనిచ్చాను. ఆమె కళ్లుమూసుకుంది.
”నిద్రపోతున్నావా?”
”లేదు.”
”మరి?”
”ఆ పిల్లాడి ముఖం ఇంకా మనసులోనే ఉంది.”
నేను ఏమీ మాట్లాడలేదు.
ఆమె మెల్లగా నా చేతిని తన చెంప కిందకి లాగుకుంది. ఆ స్పర్శలో ప్రేమకంటే నమ్మకం ఎక్కువగా ఉంది.
పన్నెండున్నరకి ఆమె ఊరు వచ్చింది. కారు గేట్ ముందు ఆగింది. ఆమె నెమ్మదిగా లేచింది.
”నిజంగానే వెళ్తావా?”
”వెళ్లాలి.”
”ఉండొచ్చు కదా.”
”రేపు మీటింగ్ ఉంది.”
ఆమె కారు దిగింది.
”చేరాక మెసేజ్ చేయి.”
”సరే.”
”మధ్యలో టీ తాగు.”
”సరే.”
ఆ తర్వాత మెల్లగా…
”ఈ రాత్రి చాలా అరుదైన రాత్రి” అంటూ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయింది.
కారు మళ్లీ కదిలింది.
హైవే మీదకి వచ్చాక ఆమె నుంచి మెసేజ్…
”నిద్రపోకు.”
”సరే.. మరి నువ్వూ..?” నేను రిప్లై ఇచ్చాను.
కొద్దిసేపటి తర్వాత వచ్చింది…
Impossible’
ఆ రాత్రి తిరుగు ప్రయాణంలో… మొదటిసారి నాకు రోడ్డు పొడవుగా అనిపించలేదు.
రామ్
రహదారిపై ఓ రాత్రి
- Advertisement -
- Advertisement -



