– సిరిసిల్ల వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్మపర్సన్ వెలుముల స్వరూప
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సిరిసిల్ల వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్మపర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తాడూర్ లో నూతన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిరిసిల్ల వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం మద్దతు ధర రూ.2320 తో పాటు సన్న వడ్లకు రూ.500ల బోనస్ ప్రకటించిదన్నారు. పరిసర ప్రాంతాల రైతులు ఈ కేంద్రంలో ధాన్యం విక్రయించాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు.ఈ కార్యక్రమం లో వ్వవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ళ నర్సింగం గౌడ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సాధాకర్, నవీన్ రావు, రాజలింగం గౌడ్, నాయకులు భాస్కర్ రెడ్డి, రంగు శ్రీనివాస్, శ్రీరామ్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, రైతులు పాల్గొన్నారు.