డిజెలు.. మోత మోగొద్దు

DJs..don't be so loud.– మాట ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు…

– ప్రభ బండి నిర్వహకులదే పూర్తి బాధ్యత….
– డీజే మోగితే…సీజ్ చెయ్యడమే..
– పోలీసులకు సహకరించాలి..
– మమునూరు ఎసిపి తిరుపతి
నవతెలంగాణ – గీసుగొండ 
కొమ్మల జాతరలో డిజెల మోత మోగోద్దు…ప్రభ ఊరేగింపు సమయంలో పోలీసుల మాట వినుకుంటే కఠిన చర్యలు తప్పవని మామునూర్ ఎసిపి తిరుపతి అన్ని పార్టీలవారిని హెచ్చరించారు. కొమ్మాల గుడి వద్ద గల విష్ణు ప్రియ గార్డెన్స్ లో వివిధ పార్టీ నాయకులతో కలిసి పోలీసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎసిపి తిరుపతి మాట్లాడుతూ…ప్రభ బండ్లు ఏర్పాటు చేసే నిర్వాహకులు వారి బండ్ల వద్ద ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.పోలీసుల సూచనలు అందరు పాటించాలి. దేవాలయ ప్రవేశం మరియు తిరుగు ప్రయాణం ఎలా అనేది ..వివరంగా డైరెక్షన్ బోర్డ్స్ ఏర్పాటు చెయ్యడం జరిగింది అన్నారు. నిఘా నేత్రాలు ఏర్పాటు చెయ్యడం జరిగిందని అన్నారు. వివిధ హొదాలకు చెందిన 400 మంది పోలీసులు బందోబస్తు వుంటుందని అన్నారు. మప్తి పోలీసులు కూడా జాతర పరిసరాల్లో తిరుగుతారని అన్నారు.సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరిగిన సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ..సీఐ మహేందర్,ఎస్సై కుమార్,ప్రశాంత్ వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గత సంవత్సరం… మాదిరేనా !
గత సంవత్సరం ఎలక్షన్ కోడ్ లో సైతం ప్రభ బండ్లు పార్టీ జెండాలతో డీజే మోతలతో కొమ్మాల జాతర పరిసరాలు మొత్తం మార్మోగాయి… ఎమ్మెల్యేలు సైతం వచ్చి వారి పార్టీ ప్రభల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రభలను ప్రారంభించిన పరిస్థితులు ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వున్నప్పుడే అలాజరిగితే మరి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో చూడాలి.ఏదిఏమైనా డిజేల శబ్దాలు లేకుండా సాంప్రదాయ పద్ధతిలో డప్పులు ,కొలాటాలతో తీసుకుపోతే బాగుండు అని ప్రజలు అనుకుంటున్నారు.
Spread the love