అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వొద్దు..

Don't indulge in unsocial activities..– కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు/ కాటారం
 గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వొద్దని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్ రెడ్డి అన్నారు. కాటారం మండలంలోని గంగారం క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాకాబంది నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సివిల్, టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది గ్రామాన్ని చుట్టుముట్టి ఇంటింటా సోదాలు నిర్వహించారు. అనుమానితులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్స్ లేని 18 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలను సీజ్ చేశారు. గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడి భవిష్య తను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి రవాణా, విక్రయం, సేవించడం చట్టరీత్యా నేరమని చెప్పారు. గుడుంబా నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పేర్కొన్నారు. గంజాయి, గుడుంబా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని, వీటిపై తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాటారం సీఐ నాగార్జున రావు, కాటారం. మహాము త్తారం, కొయ్యూరు ఎస్సైలు అభినవ్, మహేందర్ కుమార్, నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love