– డీఎస్పీ శ్రీనివాస్
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని లాడ్జింగ్ లు, పరసర ప్రాంతాల్లోని లాడ్జింగ్ యాజమాన్లు ఆధార్ కార్డు, చిరునామా వివరాలు ఫోన్ నెంబర్లు లేకుండా ఇతరులకు రూమ్లు అద్దెకు ఇవ్వద్దని అచ్చంపేట డిఎస్పి శ్రీనివాసులు హెచ్చరించారు. నల్లమల్ల అటవీ ప్రాంతం, శ్రీశైలంతో పాటు ఇతర ప్రకృతి అందాలు, పుణ్యక్షేత్రాలు పర్యాటక క్షేత్రాలు ఉండడంతో రాష్ట్ర నలుమూరాల నుంచి వివిధ ప్రాంతంలో కొత్త వ్యక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. లాడ్జింగ్ యజమానులు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలన్నారు. కొందరు లాడ్జింగ్ యజమానులు గుర్తులేని వ్యక్తులకు రూములు అద్దెకు ఇస్తున్నారని తెలిసింది. అదేవిధంగా ప్రతి లాడ్జింగ్ లో సీసీ కెమెరాలు నిరంతరంగా పనిచేసే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. రూమ్ లను అద్దెకిచ్చే వారి వివరాలను రోజువారి రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. త్వరలోనే అచ్చంపేట పరిసర ప్రాంతాల్లోని లాడ్జింగ్ లను పోలీసులు తనిఖీ చేస్తారని హెచ్చరించారు.