మండల కేంద్రానికి చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి ‘లిమ్నలాజికల్ స్టడీస్ ఆఫ్ నిజాంసాగర్ రిజర్వాయర్’ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. శ్రీనివాస్ రెడ్డి మొట్టమొదట స్కూల్ అసిస్టెంట్ గా నిజాంసాగర్ లో 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత జూనియర్ లెక్చరర్ గా ప్రమోషన్ పొందారు. జూనియర్ లెక్చరర్ గా15 సంవత్సరాలు ఐలాపూర్, నిజామాబాద్ ఖిల్లా కాలేజీలో పనిచేసిన తర్వాత 2016 లో డిగ్రీ లెక్చరర్ గా ప్రమోషన్ పొంది గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మోర్తాడ్ లో పనిచేశారు. 2018 నుండి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు జంతు శాస్త్ర విభాగ అధిపతిగా కొనసాగుతున్నారు.