రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
అత్యవసర పరిస్థితుల్లో ఓ ప్రాణాన్ని కాపాడాలంటే రక్తదానం ఎంతో అవసరం, రక్త దాతలు లేక అనేక ప్రాణాలు అర్ధ ఆయుష్షుగా ముగుస్తున్నాయి. రక్తదానంపై అవగాహన కల్పిస్తూ అనేక రక్తనిధి కేంద్రాలు సైతం ఏర్పాటు చేస్తూ సంవత్సరంలో రెండు నుంచి మూడుసార్లు రక్తదానం చేయచ్చని దీనితో రక్తం సైతం ఉత్పత్తి అవుతుందని నిపుణులు తెలియజేస్తున్న విషయం తెలిసిందే, సోమవారం బంజారా హిల్స్‌లోని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ శంకర్‌ రామ్‌ బాల్‌ విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో కేర్‌ ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయాలని పిలుపు రావడంతో వెంటనే వెళ్లి రక్త దానం చేశారు. ఏ మాత్రం ఆలోచించకుండా రక్తదానానికి ఒప్పుకొని రక్తదానం చేసి తన వీధి నిర్వహణతో పాటు కర్తవ్యాన్ని నెరవేర్చి శభాష్‌ అనిపించుకున్నారు. ఉన్నతాధికారులు బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆయనను అభినందించారు.

Spread the love