మండలంలోని కొంపెల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలకు వెదిరే పూలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 వేల విరాళంలో అందించినట్లు వెదిరే పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరే మెగా రెడ్డి ,వెదిరే శ్రీనివాస్ రెడ్డి , శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ వెదిరే విజేందర్ రెడ్డి తెలిపారు. గ్రామంలో ఆపదలో ఉన్న ఎంతోమంది కుటుంబాలకు అండగా ఉండడంతో పాటు గ్రామంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం వెదిరే బ్రదర్స్ చేస్తున్న కృషి గ్రామంలోని ప్రజలు అభినందిస్తున్నారు. గ్రామంలో కులమతాలకు అతీతంగా నిర్వహించుకునే శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు లక్ష రూపాయల విరాళం , శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు 50 వేల విరాళం అందజేయడంతో వెదిరే బ్రదర్స్ గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆంజనేయ స్వామి గుడి వద్ద నిర్వహించే సీతారాముల కళ్యాణం కు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.