రైతులు దళాలను నమ్మి మోసపోవద్దు…

– కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి
నవతెలంగాణ-తొగుట
రైతులు దళాలను నమ్మి రైతులు మోసపోవద్దని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఘన పూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళాలను మోసపోవద్దని, ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లోనే దాన్యం విక్రయించుకోవాలని సూచిం చారు. వచ్చే సీజన్ లో రైతులందరూ సన్న వడ్లు సాగు చేయాలని, ప్రభుత్వం క్వింటాల్ రూ. 500 బోనస్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మాధవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మ్యాదరి స్వామి, సిఎలు రాజశేఖర్, మమత, నాయకులు కుంభాల శీను, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, కనుక రెడ్డి, రాజయ్య, పాచయ్య, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love