– పందిల్లలో రైతులు రోడ్డుపై ధర్నా
– నిలిచిన వాహనాలు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : కొనుగోలు సెంటర్ లో ధాన్యం పోసి నెలరోజులు గడిచిందని ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం పందిల్ల గ్రామంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు సెంటర్ లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు. రైతు అమ్ముకునే ధాన్యం కొలుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసేంతవరకు ధర్నా విరమించేది లేదన్నారు. రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై లక్ష్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
నెల రోజులైనా ధాన్యం కొనుగోలు చేయరా..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



