నవతెలంగాణ – మల్హర్ రావు/మహముత్తారం
మహముత్తరం మండలంలో పలు బాధిత కుటుంబాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరమర్షించి అధైర్య పడొవద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని,ఓదార్చారు.మండలంలోని పోలారం గ్రామంలో తాళ్లపెళ్లి సారయ్య, మహముత్తారం గ్రామంలో బౌతు సడవలి తల్లి పోసమ్మ, నర్సింగాపూర్ గ్రామంలో భీఆర్ఎస్ పార్టీ నాయకుడు లక్కిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నానమ్మ మధునమ్మ ఇటీవల మరణించగ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.