అడవులలో వెలసిన గుత్తి కోయ గుడాలలో అపరిచితులు వస్తే ఆశ్రయం కల్పించకూడదని పసర పోలీస్ స్టేషన్ సిఐజి రవీందర్ అన్నారు. శుక్రవారం పసర నూతన సీఐ రవీందర్, పసర ఎస్ ఐ కమలాకర్ మరియు సిబ్బందితో కలిసి పసర పరిధి లోని పందిరి దోన గుత్తికోయ గూడెం ను సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా సీఐ రవీందర్ గూడెం ప్రజలతో మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించకుడదని ఎవరైనా కొత్త వ్యక్తులు తమ గ్రామం కు వస్తే తమకు సమాచారం అందించాలని తెలియచేసారు.చట్ట వ్యతిరేక మైన కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతే కాకుండా అక్కడి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న వానాకాలం దృశ్య వరదలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించటం జరిగింది.ఎస్సై కమలాకర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వారి ఆరోగ్యం గురించి ఇతరత్రా రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించటం జరిగింది.