సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ఆరెగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీరుని గెలిపించాలని గురువారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఇల్లులు తిరుగుతూ మాట్లాడుతూ దేశంలోని బీజేపీ ప్రభుత్వము రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల అనుసరిస్తున్నారని ఆ విధానాలను ఓడించాలని సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం జిల్లా కమిటీ సభ్యులు కీసరి నర్సిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో గత పది ఏళ్ల కాలంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించి ప్రజలను అష్ట కష్టాలు పెట్టిందని అన్నారు. కేంద్రంలో కార్పోరేట్ శక్తులకు అనుగుణంగా కార్మిక చట్టాలని సవరించి కార్మికులను పెట్టుబడిదారులకు బానిసరూపాలను తీసుకొచ్చిందని అన్నారు. ఎనిమిది గంటల స్థానంలో 12 గంటల పని విధానం చేసుకోవచ్చని యజమానులకు వంద పాడారు కనీస వేతనాలు అడగడానికి వీలులేదు యజమాని ఎంత ఇస్తే అంత తీసుకోవాలని పదంలో పద్ధతిలో లేబర్ కోడ్లను తీసుకువచ్చారని కావున ఇలాంటి విధానాలను అనుసరిస్తున్న బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం జిల్లా కమిటీ సభ్యులు నర్సిరెడ్డి అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి కార్పోరేట్ శక్తులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను మార్చారని ఈ విధానాలకు వ్యతిరేకంగా 13 నెలల కాలం పాటు పోరాడి 750 మంది రైతులు తమ ప్రాణాలను బలి ఇచ్చారన్నారు. చలో పార్లమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా రైతులపై పార్లమెంట్ సభ్యుడు కుమారుడు కారకించి హత్య చేశాడని అన్నారు. నేడు బీజేపీలో ఉన్న బూరా నర్సయ్య గౌడ్ గతంలో పార్లమెంట్లో ఉండి ప్రజా సమస్యలను ప్రశ్నించలేదన్నారు. ఈరోజు ఒక పార్టీ రేపు ఒక పార్టీ ఉండే అభ్యర్థులను ఓడించాలని కోరారు. ప్రజా జీవితంతో సంబంధంలేని కాంగ్రెస్,బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి పిసాటి ముత్యంరెడ్డి మాజీ ఎంపీటీసీ బద్దం అంజయ్య గౌడ్ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నాయకురాలు సబిత,కొలను శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love