మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నిజామాబాద్‌లో 396 డబుల్ బెడ్రూం ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పి ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్‌లో ఇచ్చిన 1500 ఇందిరమ్మ ఇండ్లలో 300 ఇండ్లు మాత్రమే కట్టారని చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని కేసీఆర్ ఇండ్లు కట్టలేదని చెప్పడం హాస్యాస్పదని అన్నారు. బాన్సువాడలో 11 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టామని గుర్తు చేశారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయం బయటపడిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చివరలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధర్నా పేరుతో 50 మందితో హడావుడి చేశారని అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళను మాత్రం హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. 22ఏ విషయంలో రాష్ట్రం మొత్తం రగిలిపోతోందని చెప్పారు. సీఎం ఇల్లు కూడా 22ఏ లో ఉందన్నారు. డబ్బులు వసూలు చేసే మిషన్‌గా 22ఏ మారిందని ఆరోపించారు. సీఎంకు, మంత్రుల మధ్య సఖ్యత లేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు చేయించిన సర్వేల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని తేలిందని చెప్పారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దొరికినకవాడికి దోచుకుంటున్నారని అన్నారు. నిజామాబాద్ ప్రజలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు సుమిత్రానంద్, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి, బొమ్మెర రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మోసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



