పోలియో చుక్కలు విజయవంతంగా నిర్వహించాలి: డాక్టర్ బిక్కు నాయక్

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల గ్రామాలలో ఆదివారం జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారి డాక్టర్ బిక్కు నాయక్, డాక్టర్ శివ లీల తెలిపారు. ఉప్పునుంతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం పై అవగాహన ర్యాలీ, సిబ్బందికి సమావేశం నిర్వహించి ఉప్పునుంతల మండలంలోని ఇప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరలలోపు పిల్లలుకు 2942 మందికి పోలియో చుక్కలు వేయాలని మిగిలిన వారికి సోమవారం, మంగళవారం ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయాలని తెలిపారు .ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ సిబ్బంది సిహెచ్ఓ అశోక్ ప్రసాద్,  ఓ శ్రీను, మధు నాయక్ ,ప్రభావతి ,జోన్స్ ఫార్మసిస్ట్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
Spread the love