
గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణను ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంటు త్వరగా విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం సహస్ర ఫౌండేషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ఆయుష్ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చినకని శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ కనుసానల్లో ఫోన్ టాపింగ్ వ్యవహారం ప్రతిపక్షాలపై మరియు అనేకమంది రాజకీయ, ప్రభుత్వ అధికారులపై జడ్జీల పై ఫోన్ టాంపరింగ్ చేసినటువంటి నిందితులను త్వరగా విచారణ జరిపి అసలైన నిందితులని విచారించి, ఇటువంటి వ్యవహారాలు ముందు ముందు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ చినకని శివప్రసాద్ తెలిపారు.