గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోండి: డాక్టర్ నరేష్

నవతెలంగాణ – తుంగతుర్తి
పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా పాడి రైతులు వ్యాధి నివారణ టీకాలను వేయించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ నరేష్ అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని కర్విరాల గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.ఈ మేరకు మొత్తం 108 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు.3 నెలల వయసు పైబడిన పశువులన్నింటికీ ఉచితంగా టీకాలు ఇస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులకు,పశుపోషకులకు సమాచారం ఇచ్చి చాటింపు చేయించి గ్రామాలకు ఉదయాన్నే వెళ్లి పశువులకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు.పశువులకు గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైందని,ఈ వ్యాధి సోకిన పశువుల నోటిలో, కాళ్లలో పుండ్లు ఏర్పడి మేత మేయక,నడవలేక నీరసిస్తాయన్నారు.పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పడిపోతుందన్నారు.వ్యాధి సోకిన పశువులకు చికిత్స చేయకుంటే మరణిస్తాయన్నారు.పశుపోషకులు పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేయించి వ్యాధులు సోకకుండా కాపాడుకోవాలని వైద్యాధికారి కోరారు.ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రవి, గోపాలమిత్ర శ్రీనివాస్ రెడ్డి,పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love