– దోమల నివారణ తో పాటు పరిశుభ్రత ముఖ్యమే – వైద్యాధికారి డాక్టర్ రాందాస్
నవతెలంగాణ – ఆశ్వారావుపేట
దోమల నివారణ తో పాటు వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమే నని అశ్వారావుపేట(వినాయక పురం) ప్రాధమిక ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ రాందాస్ అన్నారు.ఈ ఆసుపత్రి పరిధిలోని మలేరియా ప్రభావిత గ్రామమైన తిరుమలకుంట కాలనీ లో 114 గృహాల్లో,సున్నంబట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాల(ఏ హెచ్ ఎస్) లోని గదులు అన్నింటిలోనూ సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో బుధవారం చేపట్టిన దోమల నివారణ మందు ఏ సీఎం 5%(ACM 5%.) పిచికారీ ని ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయుల సహకారంలో పాఠశాల ప్రాంగణంలోని నీటి నిల్వలు తొలగించారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ రాందాస్ విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత,పరిసరాల పరిశుభ్రత,వానాకాలంలో సంభవించే చిరు వ్యాధులు పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఇ.ఒ రాజు,ఎం.టి.ఎస్ విజయ రెడ్డి,హెచ్.ఎస్ శ్రీను,ఎం.ఎల్.హెచ్.పి క్రిష్ణ వేణి,హెచ్.ఎ సత్యనారాయణ,ఏఎన్ఎం బీబీ నాంచారీ,చెల్లెమ్మ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.