ఎన్నికల నాటి హామీలను అమలు చేయాలి: దుగ్గి చిరంజీవి

నవతెలంగాణ – తాడ్వాయి 
ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘంలో జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మూడింటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం హర్షనీయమని, మిగిలిన మూడింటిని కూడా త్వరలో అమలుచేసి, పేదవర్గాల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదవర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, కొత్తగా రేషన్‌కార్డులు, ఆసరా పింఛన్లు మంజూరు చేయలేదన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కూడా ఇవ్వలేక పోయిందని, దీంతో పేద కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో  పేదవర్గా ల సమస్యలపై నిరంతరం పోరాటాలను సాగిస్తున్నామని, ఐక్య ఉద్యమాలతోనే సమస్యలను సాధించుకోవాలన్నారు. రైతాంగానికి అక్కుపత్రాలు పట్టాదారు పాసుపుస్తకం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు 2018కి పూర్వం ఉన్న రైతులను కూడా రుణమాఫీ చేయాలని, తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని పడ్డ సాయం కూడా వెంటనే ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సరైన సాగునీటి వస్తువులు లేవన్నారు. ములుగు జిల్లాను ఆనుకొని ఉన్న గోదావరి జలాలు ములుగు జిల్లా వ్యవసాయ రంగానికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు పరచాలని లేకుంటే అంచలంచెలుగా ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Spread the love