
– ఆధారణలో కొట్టుమిట్టాడుతుంది
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రజావాణి అమల్లో తడబడుతుంది.. ఆదరణలో కొట్టుమిట్టాడుతుంది. తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా తూతు మంత్రంగా మారుతుంది. కామరెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ దశరథ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఒక మండల పరిషత్ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి తప్ప మిగతా శాఖలు వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ, నీటిపారుదల శాఖ, విద్యాశాఖ రోడ్లు భవన శాఖ పంచాయతీరాజ్ , శిశు సంక్షేమ ,పశువైద్య, విద్యుత్ శాఖ, ఐకెపి,ఐసిడిఎస్, మిషన్ భగీరథ, తదితర శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ప్రజా సమస్యలే పరిష్కాం పరిష్కరించాల్సిన అధికారులే తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మండలంలో ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు రాకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్లి ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు అందజేస్తున్నట్లు అర్జీదారులు ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి అధికారులు ఒక్కరిద్దరు తప్ప ఎవరు రావడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దుమ్మ కొడుతున్న అధికారులపై చర్యలు లేకపోవడం వల్లనే అధికారులు ప్రజావాణిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు.