- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి 1:45 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. 2 సెకన్ల పాటు భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇది స్వల్ప భూకంపమే కావడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. శ్రీరామపురం కాలనీ, సీఎస్ఆర్ శర్మ కాలేజీ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.
- Advertisement -


