- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలోని 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకు, జార్ఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం జూన్ 18న పోలింగ్ జరగనుండగా, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. రాజ్యసభ ఎన్నికల మొత్తం ప్రక్రియ జూన్ 20 నాటికి పూర్తికానుంది.
- Advertisement -



