విస్తరణపై ఎడెల్విన్‌ లైఫ్‌ దృష్టి

న్యూఢిల్లీ : తన పంపిణీ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడం ద్వారా మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎడెల్విస్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా ఖాతాదారులను పెంచుకోవడం కోసం వ్యూహాత్మక భాగస్వాములను ఎంచుకుంటున్నట్లు ఆ సంస్థ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ అనూప్‌ సేథ్‌ అన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఈఎస్‌ఏఎఫ్‌ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదర్చుకున్నామన్నారు.

Spread the love