గృహజ్యోతికి ‘ఎడిట్’ కష్టాలు..

– ఆన్లైన్ పొరపాట్లతో అర్హులైన వారికి తప్పని తిప్పలు 
నవతెలంగాణ – బొమ్మలరామారం
కరెంట్ బిల్లులు జీరో బిల్లు రావడం రావడంలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి O ఎడిట్ ఆప్షన్  ఇవ్వాలని ఆలేరు నియోజకవర్గ బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ పాములపర్తి నరేష్ చారి అన్నారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గృహజ్యోతి పథకం (జీరో కరెంట్ బిల్) బొమ్మలరామారం మండలంలోని, మర్యాల గ్రామంలో కొంత మంది  అర్హులకు అందడం లేదని ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేసేటప్పుడు జరిగిన పొర పాట్లతో గృహ జ్యోతి పథకం దూరమైందని,ప్రజలు మ్యానువల్ గా ఇచ్చిన దరఖాస్తులను. ప్రభుత్వం ప్రజాపాలన పోర్టల్లో అప్లోడ్ చేయించింది. ఇలా అప్లోడ్ చేసే సమయంలో మీటర్ నంబర్లను తప్పుగా వేయడం లేదా స్కీమ్కు అసలు దరఖాస్తు చేసుకోలేదన్నట్టుగా (నాట్ అప్లైడ్) నమోదు చేయడంతో అర్హులకు స్కీమ్ అందడం లేదు. లబ్దిదారుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిరంతరం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నిసార్లు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన ప్రజాపాలన పోర్టల్లో లో ఎడిట్ ఆప్షన్ ఇస్తే సమస్యలన్నింటికీ పరిష్కారం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 0 జీరో బిల్ఎడిట్ ఆప్షన్ ఇచ్చి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.
Spread the love