
దివంగత కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎంపీపీ, ఎడ్లపల్లి రఘు బాబు 12వ వర్ధంతి సభను మండలంలోని దుంపెల్లి గూడెంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ఉండి పార్టీని కాపాడి తిరిగి మండలంలో పార్టీ నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత రఘు బాబు కె దక్కుతుందని అభిప్రాయపడుతూ హాజరైన నాయకులు కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. రఘు బబు హయాంలో నిర్మించిన ఇందిరమ్మ గృహాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని అన్నారు. బాబు ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు. పేద ప్రజల హృదయాలలో రఘుబాబు చరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూక్య వాణి రాజు నాయక్, పిఎసిఎస్ డైరెక్టర్ సూది రెడ్డి లక్ష్మారెడ్డి, నన్నే బోయినసోమయ్య, కాంపాటి వెంకటకృష్ణతోపాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.