Wednesday, May 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్పొరేటీకరణ ఆలోచనలతో విద్యా కమిషన్‌ రిపోర్ట్‌

కార్పొరేటీకరణ ఆలోచనలతో విద్యా కమిషన్‌ రిపోర్ట్‌

- Advertisement -


ప్రొఫెసర్‌ హరగోపాల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కార్పొరేటీకరణ ఆలోచనలతో తెలంగాణ విద్యా కమిషన్‌ రిపోర్ట్‌ ఇచ్చిందనీ, అందులో మానవీయ విలువలు లోపించాయని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌ లోని టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో పరిరక్షణ కమిటీ సమావేశం ర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ, కమిషన్‌ నివేదికలో కొన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ ఒక్కొక్క స్కూల్‌ కు 25 ఎకరాల్లో రూ. 200 కోట్లతో నిర్మాణం తలపెట్టడం, అందుకు బడ్జెట్లో 3500 కోట్లు కేటాయించడం కేవలం కాంట్రాక్టర్ల లాభాల కోసమే అని ఆరోపించారు. టీపీఎస్‌ లఏర్పాటు ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కమిషన్‌ ప్రతిపాదించినట్టు బడ్జెట్‌ లో కనీసం 18 శాతం విద్యకు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీ వైఫల్యాలపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. జూన్‌ 5న హైదరాబాద్‌ లో ర్యాలీ, ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ సమావేశంలో విద్యాపరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ప్రొ.లక్ష్మీనారాయణ, టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు చకినాల అనిల్‌ కుమార్‌, నన్నెబోయిన తిరుపతి, డీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమయ్య,టి.లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -