చదువుతోనే మనిషికి ఉన్నతమైన భవిష్యత్తు..

నవతెలంగాణ – పెద్దవూర
చదువుతోనే మనిషికి ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ప్రొఫెసర్‌ బయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండలం లో పొట్టేవాని తండా ప్రాథమిక పాఠశాల తో పాటు పలు గ్రామాల్లో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శుక్రవారం ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతి పౌరుడు చదువుకోవాలని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని వివరించారు. 5 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శపాటశాల కమిటీ చైర్మన్ రామవత్ విజయ ధసృ,  పాఠశాల ఉపాధ్యాయులు ఇరుమాది పాపిరెడ్డి,ఆయా పాఠశాల పదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love