దేశ నిర్మాణం, ఆర్థిక పురోగతిలకు విద్యాలయాల్లోనే పునాది

– ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
నేటి భారతదేశ నిర్మాణానికి ఆర్థిక పురోగతికి విద్యాలయాల్లోనే పునాది బాటలు పడతాయని ప్రధానోపాధ్యాయులు నమిల భరత్ కుమార్ అన్నారు. బుధవారం, మైలార్ గడ్డ తండా మండల ప్రాథమిక పాఠశాల, స్థానిక స్వపరిపాలన దినోత్సవం పండుగ వాతావరణం లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నమిల భరత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు దేశ నిర్మాణంలో అంకితం కావడానికి కృషి చేయాలని అన్నారు. అలాగే జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకున్నారు. శాస్త్రవేత్తలు సివి రామన్ రామనఫెక్టును కనుక్కొని దేశాన్ని ఉన్నతంగా నిలిపారని, ప్రతి విద్యార్థి బాగా చదివి విశాల దృక్పథంతో వైజ్ఞానిక ప్రపంచాన్ని నిర్మించాలని అన్నారు. జగదీష్ చంద్రబోస్, శాంతి స్వరూప్, భట్నాగర్,  హెచ్ జహంగీర్ బాబా, వెంకట్రామన్ రామకృష్ణన్, సీఎన్ రావు లలాగ సైంటిస్టులు కావాలని పిలుపునిచ్చారు. సైన్స్ తోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సహోపాధ్యాయులు ఎన్ నలిని కుమారి, అంగన్వాడీ టీచర్ జీలమ్మ, లక్ష్మి, ఎస్ఎంసి సభ్యులు సునీత, కవిత, మౌనిక, సాలమ్మ, మంజుల, నరసింహ, జావిద తదితరులు పాల్గొన్నారు.
Spread the love