ఉపాధి హమి పధకాన్ని సమర్ధవంతంగా అమలు చేయండి.

– మంత్రి సీతక్కకు డీబీఎఫ్ నేత పి.శంకర్ విన్నపం
నవతెలంగాణ – మిరు దొడ్డి 
జాతీయ గ్రామీణ ఉపాధి హమి పధకాన్ని సమర్ధవంతంగా అమలు చెసి కూలీల హక్కులను కాపాడాలని రాష్ట్ర పంచాయతి రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కు డిబిఎఫ్ నేత పి .శంకర్ విన్నవించారు. కేంద్ర బడ్జెట్ లో నిధులు తగ్గించడం,నేషనల్ మోబైల్ మానిటరింగ్ సెంటర్ ( ఎన్ ఎం ఎస్ )అధార్ బెస్ డ్ వేతనాల చెల్లింపు పద్దతులను చెపట్టి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హమి చట్టాన్ని ఉల్లంఘిస్తు పని హక్కులను కాలరాస్తుంద ని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మంత్రి సితక్కకు వివరించారు.ఈ సందర్బంగాఅయన మాట్లాడుతు గత బిఅర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉపాధి హమి చట్టాన్ని అడుగడుగున ఉల్లంఘించిందని అరొపించారు.ఉపాధి హమి చట్టం ప్రకారం సంవత్సరంలో కుటుంబానికి వంద రోజుల పని కల్పించి,కనీస వేతనంతో పాటు,ఆడ మగ సమాన వేతనం చెల్లించాలాని చట్టం ఆదేశిస్తుందన్నారు.గ్రామీణ ప్రజల వలసలను అపాలనె ప్రధాన ఉద్దేశంతో గత యుపిఎ ప్రభుత్వం 2005 నుండి  ఉపాధి హమి చట్టాన్ని అమలులో కి తీసుకవచ్చిందన్నారు.తద్వారా ఆకలి చావులు,వలసలను తాత్కాలికం గా అపగలిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు,అదివాసిలకు,పేదలకు పంపిణి చేసిన లక్షల ఎకరాల భూముల అభివృద్ధి జరిగిందన్నారు. తద్వార కూలీలకు తమ బతుకు దెరువు పైసైతం ఒక నమ్మకం ,భరొసా కలిగిందన్నారు. ఇది జిర్ణించుకోలెని బిజెపి,బిఅర్ఎస్ ప్రభుత్వాలు ఉపాధి హమి పధకం అమలులో తీవ్రమైన నిర్లక్ష్యానికి పాల్పడ్డాయి.కూలీల నమ్మకాన్ని పొగొట్టాయన్నారు చెసిన పనికి 15 రోజులలో వెతనాలు చెల్లించాలని చట్టం ఆదేశిస్తున్న 75 రోజుల కు పైగా వేతనాలు ఆలస్యం అవుతుండటంతో కూలీలు పధకం పట్ల విముఖుత చూపించాచాల్సిన పరిస్ధితి కి నెట్టబడ్డారని అవెదన వ్యక్తం చేసారు..రాష్ట్రం లో 52.9 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఉండగా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం 35,630 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిదినాలు కల్పించారని వివరించారు.. చట్టప్రకారం 60-40 శాతం రెషియోలో వేతనాల,మెటిరియల్  పనులకు నిధులు ఖర్చు చేయాల్సి వుండగా నిబంధనలకు విరుద్దంగా గత బిఅర్ఎస్ ప్రభుత్వం మెటిరియల్ శాతాన్ని 57 శాతంగా ఖర్చు చెసిందని పిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో ఉపాధి హమి చట్టాన్ని  చట్టంగా అమలు చెసి తిరిగి కూలీలకు భరొసా కల్పించేందుకు ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకొవాలని కోరారు.పధకం సక్రమంగా అమలు ఈ క్రింది చర్యలు చెపట్టాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి కుటుంబానికి 100 రోజుల పని దినాలను కల్పించెందుకు ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలన్నారు. పని కొసం దరఖాస్తు లు తీసుకొని 15 రోజుల్లో పని కల్పించాలి. పని కల్పించని కూలీలకు చట్టం ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు..సర్కులర్ నెం.1456/ఇజిఎస్/పిఎం(D)2010,తేది20-10-2010 ప్రకారం వికాలంగులకు 150 రోజుల పనిదినాలను కల్పించాలి.అదె విధంగా ఎస్సీ ఎస్టీ లకు సైతం పని దినాలను పెంచాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసిన పనికి 15 రోజుల్లోకనీస  వేతనాలు చెల్లించి కూలీలకు భరొసా కల్పించాలి. ఆలస్యం వేతనాలకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. కూలీలకు 5 లక్షల ప్రమాద భీమా ను అమలు చేయాలన్నారు.ప్రతి కూలీకి పది లక్షల రాజీవ్ వైద్య భీమా కార్డులను పంపిణీ చేయాలన్నారు. మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారని అన్నారు.
Spread the love