ఎల్సిడ్‌ షేర్‌ ధర రూ.2.36 లక్షలు పైనే

Elcid share price is above Rs.2.36 lakhs– స్టాక్‌ మార్కెట్‌లో సరికొత్త రికార్డ్‌
ముంబయి : ఎల్సిడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ షేర్‌ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఒక్క రోజులోనే రూ.3.5 నుంచి ఏకంగా రూ.2.36,250కు పెరిగింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.4,725 కోట్లకు చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు రూ.1,22,577 ధరతో అత్యధిక విలువ కలిగిన ఎంఆర్‌ఎఫ్‌ను ఎల్సిడ్‌ అధిగమించినట్లయ్యింది. గతేడాది నుంచి ఎల్సిడ్‌ షేర్లు రూ.3.21 వద్ద నిలిచిపోయి ఉన్నాయి. మంగళవారం రీలిస్టింగ్‌ అయ్యింది. సెబీ ఆదేశాల మేరకు నిర్వహించిన స్పెషల్‌ కాల్‌ యాక్షన్‌లో ఒక్క పూటలోనే 73,600 రెట్లు పెరిగింది. ఏసియన్‌ పెయింట్స్‌లో ఎల్సిడ్‌కు 2.95 శాతానికి సమానమైన రూ.8,500 కోట్ల విలువ చేసే 2 లక్షల పైగా షేర్లను కలిగి ఉంది. రూ. 2,25,000 వద్ద షేరు ధర ప్రారంభమైనప్పటకీ వెంటనే 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 2,36,250 వద్ద ముగిసింది. ఒక్క రోజులో కేవలం 278 షేర్లు మాత్రమే ట్రేడింగ్‌ అయ్యాయి.

Spread the love