ముత్తారం మండల కేంద్రంలోని ఎస్‌బిఐ బ్యాంక్‌ను ఓ ప్రైవేట్ భవనంలోని మొదటి అంతస్థులో ఏర్పాటు చేసి సేవలు అందిస్తుండగా, అది వృద్ధులు, వికలాంగులను అవస్థలకు గురిచేస్తుంది. పెన్షన్ డబ్బుల కోసం ప్రతి నెల బ్యాంక్‌కు వెళ్లాలంటే వృద్ధులు, వికలాంగులకు శాపంగా మారింది. వయస్సు పైబడటం, కళ్లు సరిగ్గా కనిపించపోవడం, మెట్లు ఎక్కాలంటే వారికి ప్రతి సారి నరకం కనిపిస్తుంది. ఇదే క్రమంలో మంగళవారం ఓ మహిళా రైతు, వృద్ధురాలు రైతు బంధు డబ్బుల కోసం మొదటి అంతస్థులోని ఎస్‌బిఐ బ్యాంక్‌కు వెళ్లేందుకు నానా తంటాలు పడిరది. అసలే వృద్ధురాలు కావడం, అందులో ఆమె కాలికి ఉన్న గాయం కారణంగా ఒక్కొ మెట్టు ఎక్కేందుకు ఎంతో నరకయాతను గురైంది. బ్యాంక్ యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి వృద్ధులు, వికలాంగులను దృష్టిలో పెట్టుకొని మొదటి అంతస్థులో కాకుండా కింద ఉండే విధంగా బ్యాంక్ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.