కోనరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆవరణలో కోనరావుపేట మండల మాలల ఐక్య పోరాట సమితి నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మాందాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎడ్ల సుధాకర్, మాదాసు భూమయ్య, కార్యదర్శి గా కులేరు బాబు, ప్రధాన కార్యదర్శి గా నక్క పర్శరాములు, కోనరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆవరణలో కోనరావుపేట మండల మాలల ఐక్య పోరాట సమితి నూతన కమిటీ ఏకగ్రీవంగా కోశాధికారి గా ఎర్రవెల్లి ప్రసాద్, గౌరవ సలహాదారు గా కులేరు చంద్రయ్య, లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు జిల్లా మాలల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ తుంగ శివరాజు, కోకన్వీనర్ జక్కుల యాదగిరి, నాలుక సత్యం, బుర యాదగిరి, జిల్లా కమిటీ సభ్యులు అంగూరి సుధాకర్ లు పాలగొన్నారు. ఈ సందర్భంగా మండల అద్యక్షులు మాందాల శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకముంచి నా ఎన్నికకు సహకరించిన మండలంలోని నా మాల సోదరులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్థిస్థానని ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ముందుంటానని అన్నారు.ఈ ఎన్నికలో మండలంలోని అన్ని గ్రామాల మాల సోదరులు హాజరు కావడం జరిగింది.