మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక

నవతెలంగాణ – తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో శనివారం సూర్యాపేట ఆర్డిఓ వేణుమాధవ్ సమక్షంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గా 08వ  వార్డుకు చెందిన శాగంటి అనసూయ రాములు ను, వైస్ చైర్మన్ గా ఏడవ వార్డుకు చెందిన కేసిడి సరళ యాదవ రెడ్డి లను  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా,  మాజీ చైర్మన్ అయిన పోతరాజు రజిని రాజశేఖర్ చైర్మన్ పదవికి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయగా  ఉన్నటువంటి 15 మంది కౌన్సిలర్లలో ఇద్దరు బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్లు  పోగా ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యే మందుల సామేల్  తో కలిపి 13 మందితో గత నెల 20న అవిశ్వాసం నెగ్గిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆర్డీవో వేణుమాధవ్ తెలిపారు. అనంతరం గెలుపొందిన చైర్మన్, వైస్ చైర్మన్ లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేల్  మాట్లాడుతూ తిరుమలగిరి మున్సిపాలిటీని జిల్లాల్లోనే మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను మందులు చేయించి మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చూపెడతానని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వమని, ప్రజలతోపాటు  గ్రామ, మండల, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నిక కాబడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ శాగంటి అనసూయ రాములు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే మందుల సామేలు కు  ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే మరియు కౌన్సిలర్ల సహకారంతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుంకరి జనార్ధన్, మీడియా ఇంచార్జి కందుకూరి లక్ష్మయ్య, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్, మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్, నాయకులు పేరాల వీరేష్, ధారావత్ జిమ్మిలాల్,పత్తేపురం సుధాకర్, మరియు కౌన్సిలర్లు తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love