– మ్యాన పవన్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైన నమోదవుతున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి ఎండలతీవ్రత నుంచి రక్షణ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఈనెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలనీ, ఎన్నికల సిబ్బందిని పోలింగ్ స్టేషన్‌లో తీసుకెళ్లే వాహ నాలు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలనీ, రిసెప్షన్ సెంటర్లో ఉద్యోగ, ఉపాధ్యా యులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రతి ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో, పోలింగ్ స్టేషన్‌లో తప్పనిసరిగా కూలర్లు, చల్లని త్రాగునీరు, ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉండే విధం గా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సమ యాన్ని పెంచిన దృష్ట్యా సిబ్బంది రాత్రి సమయంలో సొంత ప్రాంతలకు వెళ్లే విధంగా వాహనాల సౌకర్యం కల్పించాలని మ్యాన పవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.