ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలి..

– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం  రాష్ట్ర  కార్యదర్శి నారి ఐలయ్య..
నవతెలంగాణ – మునుగోడు
గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు గత రెండు నెలలుగా రావాల్సిన పెండింగ్ బిల్లులను తక్షణమే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని    పులిపల్పుల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి అనంతరం కార్మికులతో  మాట్లాడుతూ  మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనిని , ప్రజా పంపిణీ వ్యవస్థను ఎత్తివేయడం ఖాయమని చెప్పారు. బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిధులను పెద్ద ఎత్తున కోత విధించిందని అన్నారు.గత సంవత్సరం 90 లక్షల కోట్లు కేటాయించిన మోడీ ప్రభుత్వం 63 లక్షల కోట్లకు తగ్గించిందని, ప్రజా పంపిణీ వ్యవస్థకు కేటాయించే నిధులను కూడా భారీ ఎత్తున కొత్త విధించిందని, కోట్లాదిమంది గ్రామీణ పేదలు చేయడానికి పని లేక తినడానికి తిండి లేక వలసల దారి పడుతున్నారని చెప్పారు.దేశ సంపద ఒక్క శాతం మంది చేతిలోనే కేంద్రీకృతం అయిందని  మెజారిటీ ప్రజలు ఒక్క పూట తిండి దొరక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ఆహార సంక్షోభం దేశాన్ని చుట్టుముట్టిందని  నిత్యవసర సరుకులైన గ్యాస్ కూరగాయలు పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాటిని కంట్రోల్ చేయకుండా ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తుందని  గ్రామీణ నిరుద్యోగం పేదరికం పై పైకి పాకిందన్నారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని రెండు కోట్ల ఇండ్లు నిర్మాణం చేసి అందిస్తామని పేదల ఎకౌంట్లో 15 లక్షలు వేస్తామని నల్లధనాన్ని విదేశాల నుండి తీసుకొస్తామని  మాటలు చెప్పి నిలువునా మోసం చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, నాయకులు కంభంపాటి మారయ్య, బొలుగూరి యాదయ్య, నీలకంఠ సైదమ్మ, కంభంపాటి పూలమ్మ, దుర్గమ్మ, సింగం లింగమ్మ, లక్ష్మి, పగిళ్ల జయమ్మ, కవిత, యాదయ్య, పద్మ  తదితరులు పాల్గొన్నారు. అనంతరం  పులిపల్పుల గ్రామ కమిటీ. అధ్యక్షులు: బొలుగురి యాదయ్య , ఉపాధ్యక్షులు కంభంపాటి మారయ్య, దుర్గమ్మ , ప్రధాన కార్యదర్శి  కంభంపాటి పూలమ్మ, సహాయ కార్యదర్శిలు నీలకంఠ సైదమ్మ, సింగం లింగమ్మ , కోశాధికారి పగిళ్ల లింగమ్మ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
Spread the love